Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #16 Translated in Telugu

وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ
మరియు నేను అందరి కంటే ముందు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లిం) అయి ఉండాలి" అని కూడా ఆజ్ఞాపించబడ్డాను
قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇంకా) ఇలా అను: ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహా దినవు శిక్షకు గురి అవుతానని భయపడుతున్నాను
قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَهُ دِينِي
(ఇంకా) ఇలా అను: నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను
فَاعْبُدُوا مَا شِئْتُمْ مِنْ دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం
لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ
వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు: ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి

Choose other languages: