Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #129 Translated in Telugu

وَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا وَهُمْ كَافِرُونَ
కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు
أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ
ఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు (బాధలతో) పరీక్షింప బడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు
وَإِذَا مَا أُنْزِلَتْ سُورَةٌ نَظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَاكُمْ مِنْ أَحَدٍ ثُمَّ انْصَرَفُوا ۚ صَرَفَ اللَّهُ قُلُوبَهُمْ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَفْقَهُونَ
మరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు
لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِنْ أَنْفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُمْ بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَحِيمٌ
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు
فَإِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ
అయినా వారు విముఖులైతే, వారితో అను: నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు

Choose other languages: