Quran Apps in many lanuages:

Surah Ash-Shura Ayahs #21 Translated in Telugu

اللَّهُ الَّذِي أَنْزَلَ الْكِتَابَ بِالْحَقِّ وَالْمِيزَانَ ۗ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ قَرِيبٌ
అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు
يَسْتَعْجِلُ بِهَا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِهَا ۖ وَالَّذِينَ آمَنُوا مُشْفِقُونَ مِنْهَا وَيَعْلَمُونَ أَنَّهَا الْحَقُّ ۗ أَلَا إِنَّ الَّذِينَ يُمَارُونَ فِي السَّاعَةِ لَفِي ضَلَالٍ بَعِيدٍ
దానిని నమ్మని వారే దాని కొరకు తొందర పెడతారు. మరియు విశ్వసించిన వారు, దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా, సత్యమేనని తెలుసుకుంటారు. వినండి! నిశ్చయంగా ఎవరైతే తీర్పు ఘడియను గురించి వాదులాడుతారో, వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయిన వారే
اللَّهُ لَطِيفٌ بِعِبَادِهِ يَرْزُقُ مَنْ يَشَاءُ ۖ وَهُوَ الْقَوِيُّ الْعَزِيزُ
అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదుహృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు ఆయన మహా బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు
مَنْ كَانَ يُرِيدُ حَرْثَ الْآخِرَةِ نَزِدْ لَهُ فِي حَرْثِهِ ۖ وَمَنْ كَانَ يُرِيدُ حَرْثَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ نَصِيبٍ
ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము. మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు
أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُمْ مِنَ الدِّينِ مَا لَمْ يَأْذَنْ بِهِ اللَّهُ ۚ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది

Choose other languages: