Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #44 Translated in Telugu

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِنْ شُرَكَائِكُمْ مَنْ يَفْعَلُ مِنْ ذَٰلِكُمْ مِنْ شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు
ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُمْ بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ
మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని
قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُمْ مُشْرِكِينَ
వారితో ఇలా అను: భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ يَوْمٌ لَا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు
مَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنْفُسِهِمْ يَمْهَدُونَ
సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు

Choose other languages: