Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #38 Translated in Telugu

لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ
మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు
أَمْ أَنْزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ
లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి
وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
మరియు మేము మానవులకు కారణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు
أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి
فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా). ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు

Choose other languages: