Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #19 Translated in Telugu

وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِنْ نِسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِنْكُمْ ۖ فَإِنْ شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّهُ لَهُنَّ سَبِيلًا
మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి
وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنْكُمْ فَآذُوهُمَا ۖ فَإِنْ تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَحِيمًا
మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత
إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِنْ قَرِيبٍ فَأُولَٰئِكَ يَتُوبُ اللَّهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహ్ కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి, వెనువెంటనే పశ్చాత్తాప పడతారో! అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను!" అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَنْ تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَنْ يَأْتِينَ بِفَاحِشَةٍ مُبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِنْ كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَنْ تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا
ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు

Choose other languages: