Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #149 Translated in Telugu

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَنْ تَجِدَ لَهُمْ نَصِيرًا
నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు
إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّهِ فَأُولَٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا
కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు
مَا يَفْعَلُ اللَّهُ بِعَذَابِكُمْ إِنْ شَكَرْتُمْ وَآمَنْتُمْ ۚ وَكَانَ اللَّهُ شَاكِرًا عَلِيمًا
మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు
لَا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَنْ ظُلِمَ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا عَلِيمًا
అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
إِنْ تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَنْ سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا
మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, సర్వ సమర్ధుడు

Choose other languages: