Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #129 Translated in Telugu

وَمَنْ أَحْسَنُ دِينًا مِمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు
وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ مُحِيطًا
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు
وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَنْ تَنْكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَنْ تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ كَانَ بِهِ عَلِيمًا
మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: `అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.` మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది
وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَنْ يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنْفُسُ الشُّحَّ ۚ وَإِنْ تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును
وَلَنْ تَسْتَطِيعُوا أَنْ تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِنْ تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَحِيمًا
మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరి జేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: