Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #99 Translated in Telugu

وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِنْدَ اللَّهِ هُوَ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది
مَا عِنْدَكُمْ يَنْفَدُ ۖ وَمَا عِنْدَ اللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُمْ بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము
مَنْ عَمِلَ صَالِحًا مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُمْ بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము
فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో
إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు

Choose other languages: