Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #93 Translated in Telugu

وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنْفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి
إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ وَالْبَغْيِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని
وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدْتُمْ وَلَا تَنْقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ
మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ أَنْكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَنْ تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు
وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِنْ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُونَ
ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు

Choose other languages: