Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #10 Translated in Telugu

يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيُنَبِّئُهُمْ بِمَا عَمِلُوا ۚ أَحْصَاهُ اللَّهُ وَنَسُوهُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
అల్లాహ్ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపే రోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِنْ نَجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِنْ ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్ కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదుగురు రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన ఆరవ వాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువ మంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడ వున్నా సరే! తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّهُ وَيَقُولُونَ فِي أَنْفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే - పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించటం గురించి కాకుండా - పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశ పరచబడతారు
إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా, రహస్య సమాలోచన షైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్ అనుమతి లేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి

Choose other languages: