Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #14 Translated in Telugu

إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా, రహస్య సమాలోచన షైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్ అనుమతి లేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انْشُزُوا فَانْشُزُوا يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
ఓ విశ్వాసులారా! సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటు కల్పిస్తే, అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. మరియు ఒకవేళ మీతో (నమాజ్ లేక జిహాద్ కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَاجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَةً ۚ ذَٰلِكَ خَيْرٌ لَكُمْ وَأَطْهَرُ ۚ فَإِنْ لَمْ تَجِدُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలా శ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానం చేయటానికి) మీ వద్ద ఏమీ లేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత అని తెలుసుకోండి
أَأَشْفَقْتُمْ أَنْ تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَاتٍ ۚ فَإِذْ لَمْ تَفْعَلُوا وَتَابَ اللَّهُ عَلَيْكُمْ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఏమీ? మీరు (ప్రవక్తతో) ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయ పడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు, కావు మీరు నమాజ్ ను స్థాపించండి మరియు విధి దానం (జకాత్) ఇవ్వండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ مَا هُمْ مِنْكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ
ఏమీ? అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన జాతి వారి వైపుకు మరలిన వారిని నీవు చూడలేదా? వారు మీతో చేరిన వారు కారు మరియు వారితోను చేరినవారు కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు

Choose other languages: