Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #97 Translated in Telugu

لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوْا وَآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوْا وَآمَنُوا ثُمَّ اتَّقَوْا وَأَحْسَنُوا ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
విశ్వసించి సత్కార్యాలు చేసే వారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّهُ بِشَيْءٍ مِنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّهُ مَنْ يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنْتُمْ حُرُمٌ ۚ وَمَنْ قَتَلَهُ مِنْكُمْ مُتَعَمِّدًا فَجَزَاءٌ مِثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِنْكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انْتِقَامٍ
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు
أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు

Choose other languages: