Quran Apps in many lanuages:

Surah Al-Kahf Ayahs #86 Translated in Telugu

وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنْزٌ لَهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَنْ يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنْزَهُمَا رَحْمَةً مِنْ رَبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِعْ عَلَيْهِ صَبْرًا
ఇక ఆ గోడ విషయం: అది ఈ పట్టణంలోని ఇద్దరు ఆనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి (పాతబడి) ఉంది. మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్తవయస్తులైన పిదప - నీ ప్రభువు కారుణ్యంగా - తమ నిధిని, వారు త్రవ్వి తీసుకోవాలని, నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం (తత్త్వం) ఇదే
وَيَسْأَلُونَكَ عَنْ ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُمْ مِنْهُ ذِكْرًا
మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్ ను గురించి అడుగుతున్నారు. వారితో అను: అతనిని గురించి జ్ఞాపకముంచుకో దగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను
إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِنْ كُلِّ شَيْءٍ سَبَبًا
నిశ్చయంగా మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము
فَأَتْبَعَ سَبَبًا
అతను ఒక మార్గం మీద పోయాడు
حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِنْدَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَنْ تُعَذِّبَ وَإِمَّا أَنْ تَتَّخِذَ فِيهِمْ حُسْنًا
చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు. మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము: ఓ జుల్ ఖర్ నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు

Choose other languages: