Quran Apps in many lanuages:

Surah Al-Kahf Ayahs #43 Translated in Telugu

وَلَوْلَا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ ۚ إِنْ تَرَنِ أَنَا أَقَلَّ مِنْكَ مَالًا وَوَلَدًا
మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: అల్లాహ్ కోరిందే అవుతుంది (మాషా అల్లాహ్), సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్ యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)! అని అని వుంటే ఎంత బాగుండేది
فَعَسَىٰ رَبِّي أَنْ يُؤْتِيَنِ خَيْرًا مِنْ جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِنَ السَّمَاءِ فَتُصْبِحَ صَعِيدًا زَلَقًا
వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు
أَوْ يُصْبِحَ مَاؤُهَا غَوْرًا فَلَنْ تَسْتَطِيعَ لَهُ طَلَبًا
లేదా ! దాని నీటిని భూమిలో ఇంకి పోయినట్లు చేస్తే, నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేవు
وَأُحِيطَ بِثَمَرِهِ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَا أَنْفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا
మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: అయ్యో! నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్ లను) కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది
وَلَمْ تَكُنْ لَهُ فِئَةٌ يَنْصُرُونَهُ مِنْ دُونِ اللَّهِ وَمَا كَانَ مُنْتَصِرًا
మరియు అల్లాహ్ కు విరుద్ధంగా అతడికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా తనకు తాను సహాయం చేసుకోలేక పోయాడు

Choose other languages: