Quran Apps in many lanuages:

Surah Al-Jinn Ayahs #14 Translated in Telugu

وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَنْ فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا
మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు
وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا
మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము
وَأَنَّا ظَنَنَّا أَنْ لَنْ نُعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَنْ نُعْجِزَهُ هَرَبًا
మరియు నిశ్చయంగా, మేము అల్లాహ్ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము
وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَنْ يُؤْمِنْ بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا
మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గదర్శకత్వాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైనా తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు
وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا
మరియు నిశ్చయంగా, మనలో కొందరు అల్లాహ్ కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయపరులు (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు

Choose other languages: