Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #65 Translated in Telugu

وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు. అతడు అన్నాడు: ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా
قَالَ أَرَأَيْتَكَ هَٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا
ఇంకా ఇలా అన్నాడు: ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను
قَالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَوْفُورًا
ఆయన (అల్లాహ్) అన్నాడు: సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది. పరిపూర్ణ ప్రతిఫలం
وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُمْ بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِمْ بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు. మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు. మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా మరియు వారితో వాగ్దానాలు చెయ్యి. మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి
إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا
నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు

Choose other languages: