Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #22 Translated in Telugu

مَنْ كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَنْ نُرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَدْحُورًا
ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు
وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ كَانَ سَعْيُهُمْ مَشْكُورًا
మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది
كُلًّا نُمِدُّ هَٰؤُلَاءِ وَهَٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا
నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు
انْظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا
చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది
لَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَخْذُولًا
(ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు

Choose other languages: