Quran Apps in many lanuages:

Surah Al-Hijr Ayahs #91 Translated in Telugu

وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ
మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము
لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు
وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే
كَمَا أَنْزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో
الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో

Choose other languages: