Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #76 Translated in Telugu

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنْكَرَ ۖ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا ۗ قُلْ أَفَأُنَبِّئُكُمْ بِشَرٍّ مِنْ ذَٰلِكُمُ ۗ النَّارُ وَعَدَهَا اللَّهُ الَّذِينَ كَفَرُوا ۖ وَبِئْسَ الْمَصِيرُ
మరియు మా స్పష్టమైన సూచనలు వారికి వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాల మీద తిరస్కారాన్ని నీవు గమనిస్తావు. ఇంకా వారు మా సూచనలను వినిపించే వారిపై దాదాపు విరుచుకు పడబోయే వారు. వారితో అను: ఏమీ? నేను దీని కంటే ఘోరమైన విషయాన్ని గురించి మీకు తెలుపనా? అది నరకాగ్ని! అల్లాహ్ దానిని సత్యతిరస్కారులకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం
يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ ۚ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ لَنْ يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ ۖ وَإِنْ يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَا يَسْتَنْقِذُوهُ مِنْهُ ۚ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ
ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు
مَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
అల్లాహ్ దేవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు
يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింప బడతాయి

Choose other languages: