Quran Apps in many lanuages:

Surah Al-Fath Ayahs #25 Translated in Telugu

وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا عَلَيْهَا قَدْ أَحَاطَ اللَّهُ بِهَا ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا
ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَلَوْ قَاتَلَكُمُ الَّذِينَ كَفَرُوا لَوَلَّوُا الْأَدْبَارَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు
سُنَّةَ اللَّهِ الَّتِي قَدْ خَلَتْ مِنْ قَبْلُ ۖ وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا
ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్ సంప్రదాయం. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు
وَهُوَ الَّذِي كَفَّ أَيْدِيَهُمْ عَنْكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُمْ بِبَطْنِ مَكَّةَ مِنْ بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
మరియు మక్కా లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు
هُمُ الَّذِينَ كَفَرُوا وَصَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْيَ مَعْكُوفًا أَنْ يَبْلُغَ مَحِلَّهُ ۚ وَلَوْلَا رِجَالٌ مُؤْمِنُونَ وَنِسَاءٌ مُؤْمِنَاتٌ لَمْ تَعْلَمُوهُمْ أَنْ تَطَئُوهُمْ فَتُصِيبَكُمْ مِنْهُمْ مَعَرَّةٌ بِغَيْرِ عِلْمٍ ۖ لِيُدْخِلَ اللَّهُ فِي رَحْمَتِهِ مَنْ يَشَاءُ ۚ لَوْ تَزَيَّلُوا لَعَذَّبْنَا الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابًا أَلِيمًا
(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్ అల్ హరామ్ కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలి చేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా! ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే - ఎవరిని గురించైతే మీకు తెలియదో - వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు - మీకు తెలియకుండానే - పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము

Choose other languages: