Quran Apps in many lanuages:

Surah Al-Fath Ayahs #20 Translated in Telugu

قُلْ لِلْمُخَلَّفِينَ مِنَ الْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُولِي بَأْسٍ شَدِيدٍ تُقَاتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِنْ تُطِيعُوا يُؤْتِكُمُ اللَّهُ أَجْرًا حَسَنًا ۖ وَإِنْ تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُمْ مِنْ قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا
వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: ఇక మీద చాలా కఠినంగా పోరాడే వారికి విరుద్ధంగా (యుద్ధం చేసేందుకు)" మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయే వరకూ) వారితో యుద్ధం చేయవలసిన ఉంటుంది లేదా వారు లొంగి పోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలి పోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు
لَيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ ۗ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَمَنْ يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًا
కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నింద లేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నింద లేదు మరియు అదే విధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నింద లేదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు
لَقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنْزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا
వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింప జేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు
وَمَغَانِمَ كَثِيرَةً يَأْخُذُونَهَا ۗ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మరియు అందులో వారు చాలా విజయధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు
وَعَدَكُمُ اللَّهُ مَغَانِمَ كَثِيرَةً تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَٰذِهِ وَكَفَّ أَيْدِيَ النَّاسِ عَنْكُمْ وَلِتَكُونَ آيَةً لِلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُسْتَقِيمًا
మరియు అల్లాహ్ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకూను

Choose other languages: