Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #72 Translated in Telugu

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ
వారు: అది ఎలాంటిదై ఉండాలో మాకు స్పష్టంగా తెలుపమని నీ ప్రభువును ప్రార్థించు!" అని అన్నారు. (మూసా) అన్నాడు: `నిశ్చయంగా, ఆ ఆవు ముసలిది గానీ లేగదూడ గానీ కాకుండా, మధ్య వయస్సు గలదై ఉండాలి.` అని ఆయనంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ
వారు: దాని రంగు ఎలా ఉండాలో మాకు తెలుపమని నీ ప్రభువును వేడుకో!" అని అన్నారు. (దానికి అతను) అన్నాడు: `అది మెరిసే పసుపు వన్నె కలిగి, చూసే వారికి మనోహరంగా కనిపించాలి.` అని ఆయన ఆజ్ఞ
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ لَمُهْتَدُونَ
వారు ఇలా అన్నారు: అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము)
قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ
అతను (మూసా) అన్నాడు: ఆయన (అల్లాహ్) అంటున్నాడు: `ఆ గోవు భూమిని దున్నటానికి గానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా, ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.` అని!" అప్పుడు వారన్నారు: ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు." తరువాత వారు దానిని బలి (జిబ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు
وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَا كُنْتُمْ تَكْتُمُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపై నొకరు మోపుకోసాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయట పెట్టాడు

Choose other languages: