Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #38 Translated in Telugu

وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు
وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు
فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది
فَتَلَقَّىٰ آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత
قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنْ تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము (అల్లాహ్) ఇలా అన్నాము: మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

Choose other languages: