Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #95 Translated in Telugu

فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు
الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَأَنْ لَمْ يَغْنَوْا فِيهَا ۚ الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَانُوا هُمُ الْخَاسِرِينَ
షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు
فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَاتِ رَبِّي وَنَصَحْتُ لَكُمْ ۖ فَكَيْفَ آسَىٰ عَلَىٰ قَوْمٍ كَافِرِينَ
(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి
وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِنْ نَبِيٍّ إِلَّا أَخَذْنَا أَهْلَهَا بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ
మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి చేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని
ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتَّىٰ عَفَوْا وَقَالُوا قَدْ مَسَّ آبَاءَنَا الضَّرَّاءُ وَالسَّرَّاءُ فَأَخَذْنَاهُمْ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి." కావున మేము వారిని ఆకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు

Choose other languages: