Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #34 Translated in Telugu

فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ اللَّهِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ
మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు
يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు
قُلْ مَنْ حَرَّمَ زِينَةَ اللَّهِ الَّتِي أَخْرَجَ لِعِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ ۚ قُلْ هِيَ لِلَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا خَالِصَةً يَوْمَ الْقِيَامَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
ఇలా అను: అల్లాహ్ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?" (ఇంకా) ఇలా అను: ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యకంగా వారి కొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము
قُلْ إِنَّمَا حَرَّمَ رَبِّيَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْإِثْمَ وَالْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَأَنْ تُشْرِكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
ఇలా అను: నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు
وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు

Choose other languages: