Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #183 Translated in Telugu

وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ لَهُمْ قُلُوبٌ لَا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَا يَسْمَعُونَ بِهَا ۚ أُولَٰئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటి కంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు
وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ
మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారునూ మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు
وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ
మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని, మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము
وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ
మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది

Choose other languages: