Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #131 Translated in Telugu

وَقَالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ
మరియు ఫిర్ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచి పోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా?" అతడు (ఫిర్ఔన్) జవాబిచ్చాడు: మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము
قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اسْتَعِينُوا بِاللَّهِ وَاصْبِرُوا ۖ إِنَّ الْأَرْضَ لِلَّهِ يُورِثُهَا مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
మూసా తన జాతి వారితో అన్నాడు: అల్లాహ్ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్ దే! ఆయన తన దాసులలో, తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు. మరియు అంతిమ (సాఫల్యం) దైవభీతి గలవారిదే
قَالُوا أُوذِينَا مِنْ قَبْلِ أَنْ تَأْتِيَنَا وَمِنْ بَعْدِ مَا جِئْتَنَا ۚ قَالَ عَسَىٰ رَبُّكُمْ أَنْ يُهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنْظُرَ كَيْفَ تَعْمَلُونَ
(మూసా జాతివారు) అన్నారు: నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!" (మూసా) జవాబిచ్చాడు: మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు
وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము
فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَنْ مَعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِنْدَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు

Choose other languages: