Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #134 Translated in Telugu

وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము
فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَنْ مَعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِنْدَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు
وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
మరియు వారు (మూసాతో) అన్నారు: నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము
فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ
కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి
وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۖ لَئِنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ
మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనేవారు: ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయీల్ సంతతి వారిని తప్పక నీ వెంట పంపుతాము

Choose other languages: