Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #105 Translated in Telugu

تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِنْ قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ
ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు. కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు
وَمَا وَجَدْنَا لِأَكْثَرِهِمْ مِنْ عَهْدٍ ۖ وَإِنْ وَجَدْنَا أَكْثَرَهُمْ لَفَاسِقِينَ
మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే (ఫాసిఖీన్ గానే) పొందాము (చూశాము)
ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَظَلَمُوا بِهَا ۖ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో
وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ
మరియు మూసా అన్నాడు: ఓ ఫిర్ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను
حَقِيقٌ عَلَىٰ أَنْ لَا أَقُولَ عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِنْ رَبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ
అల్లాహ్ ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు

Choose other languages: