Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #44 Translated in Telugu

فَكُلًّا أَخَذْنَا بِذَنْبِهِ ۖ فَمِنْهُمْ مَنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُمْ مَنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُمْ مَنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُمْ مَنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము. మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది. ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము. ఇంకా ఇతరులను ముంచి వేశాము. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు
مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنْكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنْكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటి కంటే బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది
إِنَّ اللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِنْ دُونِهِ مِنْ شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థం చేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు
خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِلْمُؤْمِنِينَ
అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది

Choose other languages: