Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #47 Translated in Telugu

وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థం చేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు
خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِلْمُؤْمِنِينَ
అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది
اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنْزِلَ إِلَيْنَا وَأُنْزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
మరియు నీవు గ్రంథ ప్రజలతో - దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప - కేవలం ఉత్తమమైన రీతి లోనే వాదించు. మరియు వారితో ఇలా అను: మేము మా కొరకు అవతరింప జేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింప జేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే (అల్లాహ్). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము
وَكَذَٰلِكَ أَنْزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَنْ يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. మరియు మా సూచనలను సత్యతిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు

Choose other languages: