Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #42 Translated in Telugu

وَعَادًا وَثَمُودَ وَقَدْ تَبَيَّنَ لَكُمْ مِنْ مَسَاكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ وَكَانُوا مُسْتَبْصِرِينَ
మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి నివాస స్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించే వారు అయినప్పటికీ, షైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు
وَقَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ ۖ وَلَقَدْ جَاءَهُمْ مُوسَىٰ بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ وَمَا كَانُوا سَابِقِينَ
ఇక ఖారూన్, ఫిర్ఔన్ మరియు హామానులను (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకోలేక పోయారు
فَكُلًّا أَخَذْنَا بِذَنْبِهِ ۖ فَمِنْهُمْ مَنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُمْ مَنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُمْ مَنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُمْ مَنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము. మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది. ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము. ఇంకా ఇతరులను ముంచి వేశాము. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు
مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنْكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنْكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటి కంటే బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది
إِنَّ اللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِنْ دُونِهِ مِنْ شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

Choose other languages: