Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #49 Translated in Telugu

قُلْ إِنَّمَا أُنْذِرُكُمْ بِالْوَحْيِ ۚ وَلَا يَسْمَعُ الصُّمُّ الدُّعَاءَ إِذَا مَا يُنْذَرُونَ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా
وَلَئِنْ مَسَّتْهُمْ نَفْحَةٌ مِنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు
وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ
మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు
وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِلْمُتَّقِينَ
మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను
الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ وَهُمْ مِنَ السَّاعَةِ مُشْفِقُونَ
వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో

Choose other languages: