Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #87 Translated in Telugu

وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు)
وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِنْ قَبْلُ ۖ وَمِنْ ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్ కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము
وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِنَ الصَّالِحِينَ
మరియు జకరియ్యా, యహ్యా, ఈసా మరియు ఇల్యాస్ లకు కూడా (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరూ సద్వర్తనులే
وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వ లోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము
وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము (సన్మార్గం చూపాము). మేము వారిని (మా సేవ కొరకు) ఎన్నుకొని, వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము

Choose other languages: