Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #62 Translated in Telugu

قُلْ لَوْ أَنَّ عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
ఇలా అను: ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు
وَعِنْدَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ
మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది
وَهُوَ الَّذِي يَتَوَفَّاكُمْ بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు) మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తి అయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు
ثُمَّ رُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ
తరువాత వారు, వారి నిజమైన సంరక్షకుడు, అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి! సర్వ న్యాయాధికారం ఆయనదే! మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు

Choose other languages: