Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #161 Translated in Telugu

أَوْ تَقُولُوا لَوْ أَنَّا أُنْزِلَ عَلَيْنَا الْكِتَابُ لَكُنَّا أَهْدَىٰ مِنْهُمْ ۚ فَقَدْ جَاءَكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِآيَاتِ اللَّهِ وَصَدَفَ عَنْهَا ۗ سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ
లేదా మీరు: ఒకవేళ నిశ్చయంగా, మాపై గ్రంథం అవతరింప జేయబడి ఉండే మేమూ వారి కంటే ఉత్తమరీతిలో సన్మార్గం మీద నడిచి ఉండేవారము." అని అంటారని. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ఈ ఖుర్ఆన్) వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికే వాడికంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించే వాడి కంటే, మించిన దుర్మార్గుడెవడు? కాబట్టి మా సూచనల పట్ల విముఖత చూపేవారికి, వారి ఈ వైముఖ్యానికి ఫలితంగా భయంకరమైన శిక్ష విధిస్తాము
هَلْ يَنْظُرُونَ إِلَّا أَنْ تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ رَبُّكَ أَوْ يَأْتِيَ بَعْضُ آيَاتِ رَبِّكَ ۗ يَوْمَ يَأْتِي بَعْضُ آيَاتِ رَبِّكَ لَا يَنْفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ أَوْ كَسَبَتْ فِي إِيمَانِهَا خَيْرًا ۗ قُلِ انْتَظِرُوا إِنَّا مُنْتَظِرُونَ
ఏమీ? వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గానీ, లేక నీ ప్రభువు రావాలని గానీ, లేదా నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు రావాలని గానీ ఎదురు చూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు వచ్చే రోజున, పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికీ, లేదా విశ్వసించి కూడా ఏ మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు. వారితో ఇలా అను: మీరు నిరీక్షించండి. నిశ్చయంగా, మేము కూడా నిరీక్షిస్తాము
إِنَّ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا لَسْتَ مِنْهُمْ فِي شَيْءٍ ۚ إِنَّمَا أَمْرُهُمْ إِلَى اللَّهِ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا كَانُوا يَفْعَلُونَ
నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ వున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు
مَنْ جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَنْ جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ
ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు
قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ دِينًا قِيَمًا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
వారితో ఇలా అను: నిశ్చయంగా, నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకదైవ సిద్ధాంతమైన ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు

Choose other languages: