Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #142 Translated in Telugu

وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَا يَطْعَمُهَا إِلَّا مَنْ نَشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِمْ بِمَا كَانُوا يَفْتَرُونَ
మరియు వారు:"ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి. మేము కోరినవారు తప్ప ఇతరులు వీటిని తినరాదు." అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని (స్వారీ చేయటాన్ని) నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను (వధించేటప్పుడు) వాటి మీద అల్లాహ్ పేరు ఉచ్ఛరించరు. ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన (అబద్ధాలు) మాత్రమే. ఆయన త్వరలోనే వారికి, వారి (అసత్య) కల్పనలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు
وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِنْ يَكُنْ مَيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
ఇంకా వారు ఇలా అంటారు: ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది. మరియు ఇది మా స్త్రీలకు నిషేధించబడింది. కాని ఒకవేళ అది మరణించినది అయితే, వారు (స్త్రీలు) దానిలో భాగస్థులు." ఆయన వారి ఈ ఆరోపణలకు త్వరలోనే వారికి ప్రతీకారం చేస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు
قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్య చేసే వారునూ మరియు అల్లాహ్ పై అసత్యాలు కల్పిస్తూ, తమకు అల్లాహ్ ఇచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్న వారునూ, వాస్తవంగా నష్టానికి గురి అయిన వారే! నిశ్చయంగా వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు
وَهُوَ الَّذِي أَنْشَأَ جَنَّاتٍ مَعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِنْ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
మరియు ఆయనే పందిళ్ళ మీద ప్రాకే (ఎక్కించబడే) తీగలు మరియు పందిళ్ళ మీద ప్రాకని (ఎక్కించబడని) చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచి గల పంటలు మరియు జైతూన్ (ఆలివ్), దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు. వాటికి ఫలాలు వచ్చినపుడు వాటి ఫలాలను తినండి. కానీ వాటి కోత దినమున (ఫలకాలంలో) వాటి హక్కు (జకాత్) చెల్లించండి. మరియు వృథాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా, ఆయన వృథా ఖర్చు చేసే వారంటే ఇష్టపడడు
وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
మరియు పశువులలో కొన్ని బరువు మోయటానికి, మరికొన్ని చిన్నవి (భారం మోయలేనివి) ఉన్నాయి. అల్లాహ్ మీకు జీవనోపాధికి ఇచ్చిన వాటిని తినండి. మరియు షైతన్ అడుగుజాడలలో నడవకండి. నిశ్చయంగా, వాడు మీకు బహిరంగ శత్రువు

Choose other languages: