Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #130 Translated in Telugu

وَهَٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ
మరియు ఇది నీ ప్రభువు యొక్క ఋజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి, మేము ఈ సూచనలను వివరించాము
لَهُمْ دَارُ السَّلَامِ عِنْدَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُمْ بِمَا كَانُوا يَعْمَلُونَ
వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతినిలయం (స్వర్గం) ఉంటుంది. మరియు వారు (మంచి) కర్మలు చేస్తున్నందుకు ఆయన వారి సంరక్షకునిగా ఉంటాడు
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِنَ الْإِنْسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُمْ مِنَ الْإِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
మరియు ఆయన వారందరినీ జమ చేసిన రోజు వారితో ఇలా అంటాడు: ఓ జిన్నాతుల వంశీయులారా! వాస్తవంగా మీరు మానవులలో నుండి చాలా మందిని వలలో వేసుకున్నారు. అప్పుడు మానవులలోని వారి స్నేహితులు (అవులియా) అంటారు: ఓ మా ప్రభూ! మేము పరస్పరం బాగా సుఖసంతోషాలు పొందాము. మరియు నీవు మా కొరకు నియమించిన గడువుకు మేమిప్పుడు చేరుకున్నాము." అప్పుడు అల్లాహ్ వారితో అంటాడు: మీ నివాసం నరకాగ్నియే - అల్లాహ్ కోరితే తప్ప - మీరందు శాశ్వతంగా ఉంటారు! నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు
وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ విధంగా మేము దుర్మార్గులను - వారు అర్జించిన దానికి ఫలితంగా - పరస్పరం స్నేహితులు (అవులియా) గా ఉంచుతాము
يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنْسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنْذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنْفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنْفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా! ఏమీ? నా సూచనలను మీకు వినిపించి, మీరు (నన్ను) కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా?"(అని అల్లాహ్ వారిని అడుగుతాడు). దానికి వారు: (వచ్చారని!) మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం." అని జవాబిస్తారు. మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోసపుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్యతిరస్కారులుగా ఉండేవారిని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు

Choose other languages: