Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #123 Translated in Telugu

وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَيُضِلُّونَ بِأَهْوَائِهِمْ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
మరియు మీకేమయింది? అల్లాహ్ పేరు స్మరించబడిన దానిని మీరెందుకు తినకూడదు? వాస్తవానికి - గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప - ఏవేవి మీకు (తినటానికి) నిషేధింపబడ్డాయో, మీకు విశదీకరించబడింది కదా?మరియు నిశ్చయంగా, చాలా మంది అజ్ఞానంతో (ఇతరులను) తమ ఇష్టానుసారంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనకు హద్దులు మీరి ప్రవర్తించేవారి గురించి బాగా తెలుసు
وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ
మరియు పాపాన్ని - బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ - చేయటాన్ని మానుకోండి. నిశ్చయంగా, పాపం అర్జించిన వారు తాము చేసిన దుష్కృత్యాలకు తగిన ప్రతిఫలం పొందగలరు
وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ
మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షైతానులు తమ స్నేహితులను (అవులియాలను) ప్రేరేపింపజేస్తారు. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించిన వారవుతారు
أَوَمَنْ كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَنْ مَثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని, వాటి నుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మరోహరమైనవిగా చేయబడ్డాయి
وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنْفُسِهِمْ وَمَا يَشْعُرُونَ
మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు

Choose other languages: