Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #15 Translated in Telugu

قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
ఇలా అను: మీరు భూమిలో సంచారం చేసి, సత్యతిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో చూడండి
قُلْ لِمَنْ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُلْ لِلَّهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
వారిని అడుగు: ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?" అని. (నీవే) జవాబివ్వు: (అంతా) అల్లాహ్ దే!" ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు. నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశ పరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకున్నారో, అలాంటి వారే విశ్వసించరు
وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
(ఓ ముహమ్మద్!) ఇలా అను: ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా? మరియు ఆయనే అందరికీ ఆహార మిస్తున్నాడు. మరియు ఆయన కెవ్వడూ ఆహార మివ్వడు." (ఇంకా) ఇలా అను: నిశ్చయంగా, అందరి కంటే ముందు నేను ఆయనకు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లింను) కావాలని మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించేవారిలో చేరకూడదనీ ఆదేశించబడ్డాను
قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇంకా) ఇలా అను : నిశ్చయంగా, నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే నిశ్చయంగా, రాబోయే ఆ గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను

Choose other languages: