Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #116 Translated in Telugu

وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنْسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చు కోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు
وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُمْ مُقْتَرِفُونَ
మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి (మోసం) వైపుకు మొగ్గాలని మరియు వారు దానితో సంతోష పడుతూ ఉండాలని మరియు వారు అర్జించేవి (దుష్టఫలితాలు) అర్జిస్తూ ఉండాలనీను
أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنْزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِنْ رَبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
(వారితో ఇలా అను): ఏమీ? నేను అల్లాహ్ ను వదలి వేరే న్యాయాధిపతిని అన్వేషించాలా? మరియు ఆయనే మీపై స్పష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు కదా?" మరియు నిశ్చయంగా, ఇది (ఈ గ్రంథం) నీ ప్రభువు తరఫు నుండి సత్యాధారంగా అవతరింపజేయబడిందని పూర్వం గ్రంథ మొసంగబడిన ప్రజలకు బాగా తెలుసు! కావున నీవు సందేహించే వారిలో చేరకు
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
మరియు సత్యం రీత్యా మరియు న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పూర్తి అయ్యింది. ఆయన వాక్కులను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
وَإِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبِيلِ اللَّهِ ۚ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు

Choose other languages: