Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #35 Translated in Telugu

وَمَنْ لَا يُجِبْ دَاعِيَ اللَّهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَلَيْسَ لَهُ مِنْ دُونِهِ أَوْلِيَاءُ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُبِينٍ
మరియు అల్లాహ్ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో (అల్లాహ్ నుండి) తప్పించుకోలేడు. మరియు ఆతడికి, ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు. అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే
أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقَادِرٍ عَلَىٰ أَنْ يُحْيِيَ الْمَوْتَىٰ ۚ بَلَىٰ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۖ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: ఏమీ? ఇది సత్యం కాదా?" అని. వారంటారు: ఎందుకు కాదు! మా ప్రభువు సాక్షిగా (ఇది సత్యమే!)" వారితో అనబడుతుంది: అయితే, మీరు తిరస్కరిస్తూ వున్న దానికి గానూ ఈ శిక్షను రుచి చూడండి
فَاصْبِرْ كَمَا صَبَرَ أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِلْ لَهُمْ ۚ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ مَا يُوعَدُونَ لَمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِنْ نَهَارٍ ۚ بَلَاغٌ ۚ فَهَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الْفَاسِقُونَ
కావున నీవు (ఓ ప్రవక్తా!) సహనం వహించు! దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు; మరియు వారి విషయంలో తొందర పడకు. నిశ్చయంగా, వారికి వాగ్దానం చేయబడిన (శిక్షను) వారు చూసిన రోజు; వారు (ఈ ప్రపంచంలో) దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని అనుకుంటారు. (ఇదే మా) సందేశం! అలాంటప్పుడు, దుష్టులు (ఫాసిఖూన్) గాక, ఇతరులు నశింప జేయ బడతారా

Choose other languages: