Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #26 Translated in Telugu

قَالُوا أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ آلِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ
వారిలా అన్నారు: మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే (ఆ శిక్షను) తీసుకురా
قَالَ إِنَّمَا الْعِلْمُ عِنْدَ اللَّهِ وَأُبَلِّغُكُمْ مَا أُرْسِلْتُ بِهِ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
(హూద్) అన్నాడు: నిశ్చయంగా, దాని (ఆ శిక్ష) జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని, నేను మిమ్మల్ని మూఢత్వంలో పడిపోయిన వారిగా చూస్తున్నాను
فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا هَٰذَا عَارِضٌ مُمْطِرُنَا ۚ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُمْ بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు: ఈ మేఘం మాకు వర్షం ఇస్తుంది!" (హూద్ అన్నాడు): కాదు, కాదు! మీరు దేనికి తొందరపెడుతున్నారో అది (ఆ శిక్ష) ఇదే! ఒక తుఫాను గాలి, అందులో బాధాకరమైన శిక్ష ఉంది
تُدَمِّرُ كُلَّ شَيْءٍ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا لَا يُرَىٰ إِلَّا مَسَاكِنُهُمْ ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ
అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది." చివరకు వారి నివాస స్థలాలు తప్ప, అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్థులకు ప్రతీకారం చేస్తాము
وَلَقَدْ مَكَّنَّاهُمْ فِيمَا إِنْ مَكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُمْ مِنْ شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّهِ وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
మరియు వాస్తవానికి మేము వారిని దృఢంగా స్థిరపరచి ఉన్నాము; ఆ విధంగా మేము (ఓ ఖురైషులారా) మిమ్మల్ని కూడా స్థిరపరచలేదు. మేము వారికి చెవులను, కన్నులను మరియు హృదయాలను ఇచ్చాము. కాని వారి చెవులూ, కళ్ళూ మరియు హృదయాలు వారికి ఉపయోగపడలేదు; ఎందుకంటే వారు అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తూ ఉండేవారు మరియు వారు దేనిని గురించి పరిహాసం చేస్తూ ఉండేవారో అదే వారిని చుట్టుకున్నది

Choose other languages: