Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #90 Translated in Telugu

كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు
أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
అలాంటి వారి శిక్ష: నిశ్చయంగా అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే
خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْظَرُونَ
అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు
إِلَّا الَّذِينَ تَابُوا مِنْ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَنْ تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ
(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు

Choose other languages: