Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #87 Translated in Telugu

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు
قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنْزِلَ عَلَيْنَا وَمَا أُنْزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు
كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు
أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
అలాంటి వారి శిక్ష: నిశ్చయంగా అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే

Choose other languages: