Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #64 Translated in Telugu

الْحَقُّ مِنْ رَبِّكَ فَلَا تَكُنْ مِنَ الْمُمْتَرِينَ
ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు
فَمَنْ حَاجَّكَ فِيهِ مِنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنْفُسَنَا وَأَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: `అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!` అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము
إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్ కు కల్లలోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు
قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ ۚ فَإِنْ تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: `మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు

Choose other languages: