Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #124 Translated in Telugu

إِنْ تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِنْ تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِنْ تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు
وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
మరియు (ఓ ప్రవక్తా! ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో) నీవు వేకుజామున నీ ఇంటి నుండి బయలుదేరి (ఉహుద్ క్షేత్రంలో) విశ్వాసులను వారి వారి యుద్ధ స్థానాలలో నియమించటానికి వెళ్ళావు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
إِذْ هَمَّتْ طَائِفَتَانِ مِنْكُمْ أَنْ تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు మరియు విశ్వసించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి
وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَنْ يَكْفِيَكُمْ أَنْ يُمِدَّكُمْ رَبُّكُمْ بِثَلَاثَةِ آلَافٍ مِنَ الْمَلَائِكَةِ مُنْزَلِينَ
(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి)

Choose other languages: