Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #61 Translated in Telugu

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُمْ مَوْعِظَةٌ مِنْ رَبِّكُمْ وَشِفَاءٌ لِمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ
ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది)
قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِمَّا يَجْمَعُونَ
ఇలా అను: ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది
قُلْ أَرَأَيْتُمْ مَا أَنْزَلَ اللَّهُ لَكُمْ مِنْ رِزْقٍ فَجَعَلْتُمْ مِنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
ఇలా అను: మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు." ఇలా అడుగు: ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టు తున్నారా
وَمَا ظَنُّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ
మరియు అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు, తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా, అల్లాహ్ మానవుల యెడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు
وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِنْ قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ ۚ وَمَا يَعْزُبُ عَنْ رَبِّكَ مِنْ مِثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِنْ ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ
మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దాని కంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది

Choose other languages: