Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #55 Translated in Telugu

أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنْتُمْ بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنْتُمْ بِهِ تَسْتَعْجِلُونَ
ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా
ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنْتُمْ تَكْسِبُونَ
అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి! మీకు - మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప - వేరే (శిక్ష) విధించబడునా
وَيَسْتَنْبِئُونَكَ أَحَقٌّ هُوَ ۖ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ ۖ وَمَا أَنْتُمْ بِمُعْجِزِينَ
మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో అను: అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా, జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు
وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ ۗ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ ۖ وَقُضِيَ بَيْنَهُمْ بِالْقِسْطِ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ
మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు, (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు
أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ أَلَا إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు

Choose other languages: